పవర్ స్టార్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణ

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. గత ఏడు నెలలుగా ఆగిపోయిన షూటంగ్ లు మళ్లీ మొదలుకావడంతో తమ అభిమాన హీరో మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు.

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని దిల్ రాజు.. బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గత ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే పవన్ మాత్రం ఇప్పటి వరకు సెట్లోకి అడుగుపెట్టలేదు. ఈ ఆదివారం అంటే నవంబర్ 1 నుంచి సెట్ లోకి రాబోతున్నారు. దీంతో అందరి దృష్టి పవన్ పై పడింది.

చతుర్మాస దీక్ష కారణంగా పవన్ ఫామ్ హౌస్ లో సాధారణ జీవితాన్ని గడిపాడు. దీని కారణంగా లుక్ పరంగా.. ఫిట్ నెస్ పరంగా పవన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ఫస్ట్ డే షూట్ లో పవన్ ఎలా కనిపించబోతున్నారు.. లుక్ ఎలా వుండబోతోంది అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. పవన్ కున్న సమయం చాలా తక్కువ.. ఈ సమయంలోనే తనని తాను కొత్త లుక్ లోకి మార్చుకున్నాడా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఆదివారం సెట్ లోకి ఎంటరవుతున్న నేపథ్యంలో పవన్ లుక్ కి సంబంధించిన ఫొటోలు బయటికి రానున్నాయి.