Templates by BIGtheme NET
Home >> Cinema News >> హగ్గులు ముద్దులే ప్రేమ కానుక.. పాయల్ ప్రియుడు చిలిపి కుర్రాడే!

హగ్గులు ముద్దులే ప్రేమ కానుక.. పాయల్ ప్రియుడు చిలిపి కుర్రాడే!


ప్రేమలో ఉంటే ఆ గమ్మత్తే వేరు. ప్రేమ కవితలు అల్లేస్తూ ప్రేమికులు తన్మయత్వంలో మునిగి తేలతారు. ఇక బర్త్ డే ల వేళ.. ప్రేమికుల దినోత్సవానికి ప్రేయసీ ప్రియుల స్పెషల్ ట్రీట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ప్రియుడిని అభిమానులకు పరిచయం చేయనవసరం లేదు. గత ఏడాది అతడు పాయల్ బర్త్ డే సందర్భంగా ఏకంగా కవితలే అల్లాడు. అలాగే అతడి బర్త్ డే సందర్భంగా ఎప్పటికీ విడిచి ఉండని ప్రియుడు సౌరభ్ దింగ్రా గురించి కవితలు అల్లింది. తన తప్పొప్పుల్ని అర్థం చేసుకునే అతడి మనసు అంటే తనకు ఎంతో ఇష్టం అని పాయల్ అంది.

నీకంటే గొప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు. మనం కలిసి ఉన్న ప్రతి క్షణాన్ని ఎంతో భద్రంగా గుండెల్లో దాచుకుంటాను. నువ్వే నా ఆనందం.. అన్నీ. హ్యాపీ బర్త్ డే మేరీ జాన్! అంటూ పాయల్ అద్భుతమైన కవితను అల్లింది.

నేడు పాయల్ బర్త్ డే సందర్భంగా ప్రియుడి స్పందన అంతే ఇదిగా ఉంది. ఇతర అభిమానుల విషెస్ కి భిన్నంగా ప్రియుడి విష్ ఆకర్షించింది. “ఈ భూమ్మీద నేను ఎంతో అదృష్ట వంతుడిని.. ఎందుకంటే నువ్వు నా చెంతనే ఉన్నావు కదా! ఇదే మాటను ఆకాశంపై రాయాలని ఉంది.. అప్పుడు అందరికీ కనిపిస్తుంది కదా.. కానీ దానికి బదులు నీకు ముద్దులు.. హగ్గులు ఇస్తాను.. దాంతో నువ్వంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. హ్యాపీ బర్త్ డే మై ఏంజిల్..! అంటూ ప్రేమ కవిత్వాన్ని చెప్పాడు.

పాయల్ ఇటీవల ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. `అనగనగా ఓ అతిథి` సినిమాలో చక్కని నటనతో ఆకట్టుకుంది. టాలీవుడ్ లో నాయికా ప్రధాన పాత్రల్లో నటిస్తోంది.