Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఐఎంబిడి జాబితాలో రెండే ఇండియన్ సినిమాలు.. అందులో ఒకటి అల వైకుంఠపురంలో

ఐఎంబిడి జాబితాలో రెండే ఇండియన్ సినిమాలు.. అందులో ఒకటి అల వైకుంఠపురంలో


కరోనా కారణంగా ఈ ఏడాది ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపురంలో టాప్ లో నిలిచింది. ఈ ఏడాదిలో వచ్చిన రెండు పెద్ద సినిమాలు అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు కూడా భారీ వసూళ్లను నమోదు చేశాయి. అయితే అల వైకుంఠపురంలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా నిలిచింది. పాటలు.. ట్రైలర్..కలెక్షన్స్ ఇలా అన్ని విధాలుగా అల వైకుంఠపురంలో సినిమా టాప్ లో నిలిచింది. తాజాగా మరో అరుదైన రికార్డును కూడా బన్నీ సినిమా దక్కించుకుంది.

ఐఎంబిడి 2020లో అత్యధికంగా వ్యూస్ ను దక్కించుకున్న ట్రైలర్ గా అల వైకుంఠపురంలో ట్రైలర్ నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాల ట్రైలర్ ల్లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న ట్రైలర్ జాబితాలో ఇండియాకు చెందిన రెండు సినిమాలు నిలిచాయి. భాగి 3 మరియు అల వైకుంఠపురంలో సినిమాల ట్రైలర్ లు మాత్రమే నిలిచాయి. 2020 సంవత్సరంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా ఐఎంబిడి లో నిలచి నేపథ్యంలో చిత్ర మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు.