Templates by BIGtheme NET
Home >> Cinema News >> మనవడితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న అక్కినేని కోడలు..!

మనవడితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న అక్కినేని కోడలు..!


స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. బాలనటుడిగా ఎన్నో సినిమాలలో నటించిన తేజ సజ్జ ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సమంత కి మనవడిగా తేజ కనిపించాడు. ఇప్పుడు తేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జాంబీ రెడ్డి’ అనే సినిమాలో తేజ నటిస్తున్నాడు. ఇప్పుడు మనవడి సినిమాకి సామ్ తన వంతు సాయం చేస్తోంది. ‘జాంబీ రెడ్డి’ మూవీని తన చేతుల మీదుగా విడుదల చేసింది సామ్. ఈ సందర్భంగా సమంత తేజతో కలసి ఉన్న ఫోటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ట్రెండీ ఔట్ ఫిట్స్ లో ఉన్న సామ్ చిరునవ్వులు చిందిస్తూ తేజ భుజంపై చేయి వేసి కనిపిస్తోంది. తేజ వైట్ షర్ట్ బ్లూ జీన్స్ ధరించి సూపర్ కూల్ లుక్ లో కనిపిస్తున్నాడు.

కాగా సమంత ఒకవైపు పర్సనల్ లైఫ్ ని.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. వెండితెరపై అలరించిన సామ్.. ఇప్పుడు వెబ్ వరల్డ్ లోనూ రాణిస్తోంది. ఇప్పటికే ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేస్తున్న సమంత.. త్వరలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఈ పాపులర్ సిరీస్ లో సామ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. దీని కోసం సమంత పలు భాషల్లో సొంత డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఈ వెబ్ సిరీస్ తో సమంత పాన్ ఇండియా లెవల్లో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.