Templates by BIGtheme NET
Home >> Cinema News >> కొంటెగా కవ్విస్తున్న లేడీ ఎమ్మెల్యే

కొంటెగా కవ్విస్తున్న లేడీ ఎమ్మెల్యే


సరైనోడు సినిమాలో లేడీ ఎమ్మెల్యేగా నటించింది కేథరిన్ థ్రెసా. ఆ సినిమాలో కేథరిన్ అందచందాలకు స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మెగా నాయికగా రాణిస్తుందనే భావిస్తే ఊహించని విధంగా ఫేట్ మారిపోయింది. ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించినా అది కాస్తా డిజాస్టరే అయ్యింది. కాలం ఏ రకంగానూ కలిసి రాలేదు.

కేథరిన్ కి ఆ తర్వాత ఎందుకనో పెద్ద స్థాయి ఆఫర్లు ఏవీ రాలేదు. అటుపై మంచు కాంపౌండ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ ఏవీ కలిసిరాలేదు. అటుపై తమిళ పరిశ్రమకు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడా ఆశించినంత పెద్ద కెరీర్ లేదు.

ప్రస్తుతం లాక్ డౌన్ సీజన్ లో కేవలం ఫోటోషూట్ల వరకే పరిమితం అయ్యింది. అలాగే వీలున్నప్పుడల్లా షాపుల ఓపెనింగులు రిబ్బను కటింగులతో ఆర్జిస్తూ ఉపాధి పెంచుకుంటోంది. లేటెస్ట్ గా ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమం నుంచి ఇదిగో ఇలా బ్యూటిఫుల్ ఫోటోల్ని పంచుకుంది. చాలా కాలమైంది.. ఎలా ఉన్నారు? అంటూ పలకరించింది. అన్నట్టు మరీ అలా ఓరగా కొంటెగా నవ్వేస్తే కుర్రకారు తట్టుకోవడం కష్టమే.