డ్రగ్స్ ఉచ్చు నుంచి బయటపడటానికి దీపికా పదుకునే ప్రయత్నాలు…?

0

బాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో గత రెండు రోజులుగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ పెడ్లర్స్ తో దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ సంబంధాలు బయటకు రావడంతో డ్రగ్ వ్యవహారంలో దీపికా పేరు వెల్లడైంది. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేయడంతో పాటు పలువురు సెలబ్రిటీలను విచారించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు దీపికా పదుకొనె – సారా అలీఖాన్ – శ్రద్ధా కపూర్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా దీపికా పదుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీ ఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిని మూడు రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

కాగా దీపికా పదుకునే ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్నారని తెలుస్తోంది. డ్రగ్స్ విచారణ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఆమెకు సమన్లు జారీ చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నమే షూటింగ్ కి ప్యాకప్ చెప్పి ముంబైకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో అనుకున్నట్లే తాజాగా దీపికాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమన్లపై ఎలా స్పందించాలనే విషయాన్ని దీపికా తన టీమ్ తో చర్చిండమే కాకుండా లీగల్ టీమ్ ని న్యాయపరమైన సలహాలను కోరుతోందట. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ నిపుణులతో దీపిక మరియు ఆమె భర్త రణ్ వీర్ సింగ్ మాట్లాడారట. దీనిలో భాగంగా ఈ రోజు సాయంత్రం గోవా నుంచి బయలుదేరి ముంబైకి చేరుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ దర్యాప్తులో ఎన్సీబీకి వివరాలను వెల్లడించవద్దని మేనేజర్ కరిష్మా ప్రకాష్ పై దీపికా పదుకొనే ఒత్తిడి తెస్తున్నట్లు జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.