మామ అల్లుడు మళ్లీ రాబోతున్నారు

0

మామ అల్లుడు వెంకటేష్ మరియు నాగచైతన్యల మూవీ అంటూ దాదాపు అయిదు ఏళ్లు ఊరించి ఊరించి చివరకు వెంకీ మామతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో వీరిద్దరి మళ్లీ కలిసి నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ సురేష్ బాబు వద్ద మల్టీస్టారర్ కథ చెప్పాడని ఆ కథ వెంకటేష్ మరియు చైతూలకు బాగా సూట్ అవుతుంది అనే నమ్మకంతో సురేష్ బాబు ఉన్నాడు అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వెంకటేష్ మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా వారి వారి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వారు కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత ఈమల్టీస్టారర్ కు జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఈ లోపు సురేష్ బాబు ఆ కథను స్క్రిప్ట్ గా రెడీ చేయించే అవకాశం ఉంది. వెంకీ చైతూల కాంబోకు మంచి క్రేజ్ ఉంది. కనుక ఈ సినిమాను సాధ్యం అయినంత త్వరగా పట్టాలెక్కిస్తే బాగుంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2022లో మరోసారి వెంకీ మామ కాంబోను ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.