సినిమా ప్లాప్ అవడంతో డబ్బులు వెనక్కి అడుగుతున్న ఓటీటీ…?

0

థియేట్రికల్ రిలీజైన భారీ బడ్జెట్ సినిమాలు ప్లాప్ అయినప్పుడు.. ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి సినిమాని కొని నష్టపోయిన వారు ఎంతో కొంత తిరిగి ఇవ్వమని ప్రొడ్యూసర్స్ పై ఒత్తిడి తెస్తుంటారు. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత డిజిటల్ రిలీజ్ చేసిన ఇలాంటివి ఉండవని మేకర్స్ భావించారు. ఈ మధ్య థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ప్రొడ్యూసర్స్ తమ సినిమాలని ఒక రేట్ కి ఓటీటీ డీల్ కూర్చుకుని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దీని వల్ల సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రొడ్యూసర్స్ కొంత లాభాన్ని వెనకేసుకుంటున్నారు. అయితే ఈ మధ్య డిజిటల్‍ రిలీజ్‍ చేసిన ఓ ప్లాప్ సినిమాలకు బయ్యర్ల మాదిరిగా ఓటీటీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ఓటీటీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

కాగా టాలీవుడ్ లో కూడా ఈ మధ్య ఓటీటీ రిలీజులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ హీరో కెరీర్లో మైలురాయిగా నిలిచే సినిమాని ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేశారు. బడా ప్రొడ్యూసర్ ఒకరు స్టార్ కాస్టింగ్ ని పెట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయడం కష్టమనుకున్నాడో.. థియేటర్ లో రిలీజ్ చేసినా ఇంత లాభం రాదు అనుకున్నాడో తెలియదు కానీ.. ఓటీటీతో మంచి డీల్ సెట్ చేసుకొని డిజిటల్ స్ట్రీమింగ్ కి పెట్టాడు. సదరు ఓటీటీ కూడా క్రేజీ మూవీని స్ట్రీమింగ్ కి పెడితే వ్యూయర్ షిప్ పెరుగుతుందని.. సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారని భావించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరి అంచనాలు తారుమారయ్యాయి.

ఈ సినిమాకి ఓటీటీ ఆడియన్స్ నుంచి విమర్శకుల నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇతర భాషల్లో డబ్ చేసినా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనికి తోడు ఈ సినిమా హెచ్ డీ ప్రింట్ పైరసీ సైట్స్ లో కొన్ని నిమిషాల్లో దర్శనమిచ్చింది. దీంతో ఒరిజినల్ ప్రింట్ విత్ సబ్ టైటిల్స్ లో అందుబాటులో ఉండటం కూడా ఈ సినిమాని మైనస్ అయింది. ఓటీటీ వారు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో ఈ సినిమాకి అంత రేటుకి కొని తప్పు చేశామని ఆలోచిస్తోందట. ఈ క్రమంలో ఫ్యూచర్ లో మంచి సంబంధాలు ఉండాలంటే కొంత డబ్బు తిరిగి ఇవ్వాలని ఓటీటీ వారు మేకర్స్ ని డిమాండ్ చేస్తున్నారట. డిజిటల్‍ రిలీజ్‍ చేస్తే సినిమా ప్లాప్ అయినా బయ్యర్ల మాదిరి ప్రెజర్ ఉండదని భావించిన సదరు నిర్మాత షాక్ కి గురయ్యాడని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.