Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఓటీటీలో ఆదిత్య 369 తరహా ప్రయోగాత్మక మూవీ

ఓటీటీలో ఆదిత్య 369 తరహా ప్రయోగాత్మక మూవీ


డిజిటల్ యుగంలో ప్రయోగాత్మక కంటెంట్ జోరు అంతకంతకు పెరుగుతోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే వెరైటీ కంటెంట్ ని అందించడం నవతరం దర్శకరచయితలకు సాధ్యమవుతోంది. హీరోలు రకరకాల ప్రయోగాలు చేసేందుకు డేర్ చేస్తున్నారు.

ఇక టైమ్ ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు అనగానే ఆదిత్య 369 (1991) తర్వాత వేరొక సినిమా లేదు. ఇటీవలే సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కె.కుమార్ టైమ్ ట్రావెల్ వాచ్ నేపథ్యంలో వెరైటీ సినిమా తీశారు. కానీ ఆదిత్య 369లో టైమ్ ట్రావెలింగ్ మెషీన్ అనే పాయింట్ పూర్తి భిన్నమైనది.

ఇప్పుడు ఆదిత్య 369 స్ఫూర్తితో రూపొందిన బొంబాట్ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుండడం ఆసక్తిని పెంచుతోంది. రోబోలో చిట్టీ తరహా పాత్ర ఇందులో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. సుశాంత్ రెడ్డి- చాందిని చౌదరి-సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బొంబాట్’ డిసెంబర్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. చాందినితో సుశాంత్ ప్రేమాయణాన్ని గెలిపించే చిట్టీ తరహా పాత్రలో సిమ్రన్ కనిపిస్తుందట.

సింగీతం ఆనాడే అద్భుతమైన క్రియేటివిటీ సెన్సిబిలిటీస్ తో అత్యుత్తమంగా ఆదిత్య 369 ని తీశారు. ఇప్పుడు ఆ రేంజు క్వాలిటీ కంటెంట్ ని నవతరం ట్యాలెంట్ ఇస్తారా లేదా? అన్నది ఆసక్తిగా మారింది. సైన్స్ ఫిక్షన్ ప్రయోగాత్మక కంటెంట్ కి అనవసరమైన అదనపు హంగామా ట్రాక్ లు చేర్చకపోతే ఆద్యంతం గ్రిప్పింగ్ గా చూపిస్తే జనాలకు నచ్చే వీలుంటుంది. ప్రయోగాల్ని ఆహ్వానిస్తున్న నేటితరానికి కనెక్టయితే బంపర్ హిట్టు కొట్టినట్టే.