నడికుడి రైలంటి సోదరా.. ఇదేంటయో నందూ?

0

యువ హీరో నందు ఇటీవల ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. సక్సెస్ అందుకోవాలన్న కసి అతడిలో ఉంది. అదృష్టం దోబూచులాడుతున్నా… మెల్లిగా ఒక్కో అడుగు వేస్తూ కెరీర్ జర్నీ సాగిస్తున్నాడు తెలివిగా.

`సవారి` లాంటి కొత్త కాన్సెప్టునే ట్రై చేసి ఫర్వాలేదనిపించాడు. ఈసారి `బొమ్మ బ్లాక్ బస్టర్` అంటూ కొత్తగానే ట్రై చేస్తున్నాడు. ఈ మూవీలోనూ నందు వేషధారణ ఆసక్తిని కలిగించింది. పోతురాజు అంటూ బర్త్ డే పోస్టర్ వేసి బ్యాక్ గ్రౌండ్ లో ఆటో సెటప్ చేసినప్పుడే ఆసక్తిగా అనిపించింది. జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపించి నడికుడి రైలెక్కే కుర్రాడిలా అదరగొట్టాడు.

తాజాగా నడికుడి రైలంటి సోదరా.. అంటూ రిథమిక్ ట్యూన్ ని రిలీజ్ చేయగా అది అంతర్జాలంలో వైరల్ అవుతోంది. ఈ పాటకు ఉపయోగించిన టోన్.. ఎంచుకున్న ట్యూనింగ్ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం మెలోడియస్ గా గమ్మత్తుగా ఉంది. బావోయ్ బావా.. నా కర్సుకు లేవని … ! అంటూ ఇంట్రో అదిరింది. లిరికల్ ట్యూన్ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఎంతో ప్లెజెంట్ గా.. ఆహ్లాదకరమైన విజువల్స్ తో ఆకట్టుకుంది.

విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ దర్శకత్వంలో ప్రవీన్ పగడాల- బోసుబాబు- ఆనంద్ రెడ్డి- మనోహర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.