ఉగాదికి సీటీమార్ .. ఈసారి గురి తప్పడట

0

ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `సీటీమార్`. తమన్నా కథానాయిక. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ మరో నాయిక. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

స్పోర్ట్స్ నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే ఎంటర్ టైనర్ ఇది. గోపీచంద్ ఆంధ్రా టీమ్ ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్ గా నటిస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ గా నటిస్తోంది. ఆ ఇద్దరి నడుమ నడిచే ట్రాక్ ఆద్యంతం థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందట. లవ్ కం రివెంజ్ డ్రామా ఇదని లీకులందాయి. ఇరువురు ఫీమేల్ కబడ్డీ కోచ్ ల నడుమ వ్యవహారమేంటో తెరపైనే చూడాలట. గౌతమ్ నందా ఫ్లాపవ్వడంతో గోపి-సంపత్ జోడీ ఎంతో కసిగా పని చేశారని కూడా ఇంతకుముందు వెల్లడైంది.

బారీ యాక్షన్ సీక్వెన్స్ తో మూవీ రక్తి కట్టించనుంది. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఇతర ప్రాజెక్టుల వివరాలు పరిశీలిస్తే.. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు గోపీ చంద్ ఇంతకుముందు ప్రకటించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. గీతా ఆర్ట్స్ 2- యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. తేజ దర్శకత్వంలో `అలిమేలుమంగ వెంకటరమణ` చేయాల్సి ఉండగా హిందీ హీరోతో రీప్లేస్ చేస్తున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.