రవితేజ ‘క్రాక్’ నుంచి కిర్రాక్ ‘భూమ్ బద్దల్’ సాంగ్..!

0

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ సందడి చేయనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రుపందుతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ.. చిత్ర యూనిట్ ‘భూమ్ బద్దల్’ లిరికల్ వీడియో సాంగ్ ను శుక్రవారం విడుదల చేసింది.

‘భూమ్ బద్దలు.. భూమ్ బద్దలు.. నా ముద్దుల సౌండు’ అంటూ సాగే ఈ మాస్ బీట్ లో అందాల అప్సర రాణి.. రవితేజతో కలసి స్టెప్పులేశారు. ఈ ఐటమ్ సాంగ్ కి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూర్చారు. మాస్ బీట్స్ కు తగ్గట్లు సింగర్స్ సింహా – మంగ్లీ ఈ పాటను మంచి ఎనర్జీతో ఆలపించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే క్యాచీ లిరిక్స్ అందించాడు. జానీ మాస్టర్ ఈ పాటకు మాంచి మాస్ స్టెప్పులు కంపోజ్ చేసినట్లు అర్థం అవుతోంది. మేకింగ్ చూస్తుంటే రవితేజ స్టెప్పులు.. అప్సర రాణి అందాలు థియేటర్ లో ‘భూమి బద్దల్’ కొట్టేలా కనిపిస్తోంది.

కాగా ‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘క్రాక్’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ – సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.