ఔను వారు సహజీవనంలో ఉన్నారు

0

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఇప్పటి వరకు వీరిద్దరి వ్యవహారం మాత్రం క్లారిటీ రావడం లేదు. పెళ్లి అయ్యిందని కొందరు.. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం వీరికి లేనట్లుంది. కేవలం వీరిద్దరు సహజీవనంతో జీవితంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోయిన్ గా సౌత్ లోనే స్టార్ గా లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న నయన్ పెళ్లి చేసుకుని తన కెరీర్ ను చేజేతులా నాశనం చేసుకునే అవకాశం లేదు. కనుక పెళ్లి విషయమై ఇప్పుడే వారికి ఆలోచన లేనట్లుగా ఉంది.

పెళ్లి అయితే జరగలేదు కాని వీరిద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అనేది చాలా మంది బలంగా అంటున్న మాట. అది నిజమే అన్నట్లుగా ఈ ఫొటో చూస్తే అనిపిస్తుంది. ఇప్పికే వీరిద్దరు ఎన్నో సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. అనేక సార్లు పండుగలు కలిసి చేసుకున్నారు. ఆమద్య ప్రత్యేక విమానంలో నయన్ తన ఇంటికి విఘ్నేష్ ను తీసుకు వెళ్లింది. ఇంత జరుగుతున్నా కూడా కేవలం వీరు ప్రేమికులు మాత్రమే అంటూ కొందరు అంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఫొటోతో ఔను నిజంగానే వీరు లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లుగా ఉన్నారు అంటూ వారు కూడా ఒప్పుకుంటున్నారు. విఘ్నేష్ శివన్ కౌగిలిలో బందీ అయిన నయన్ జీవితంలో కూడా అతడితో బంధీ అయినట్లుగా అనిపిస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు.