బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటి వరకు వీకెండ్ ఎపిసోడ్ ల రేటింగ్ ను ప్రతి వారం ఒక ప్రత్యేక గెస్ట్ ను తీసుకు రాఇవడం వల్ల కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ దీపావళి ఎపిసోడ్ కు కూడా ప్రత్యేక గెస్ట్ హౌస్ మెంట్స్ తో మాట్లాడేందుకు రెడీ అయ్యాడు. అక్కినేని ఫ్యామిలీ నుండి సమంత అఖిల్ ఇప్పటికే స్టేజ్ పై సందడి చేయగా ఈసారి నాగచైతన్యను రంగంలోకి దించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నాగచైతన్య మరియు నాగార్జునల మద్య సందడి కనీసం 30 నిమిషాలు ఉంటుందని అంటున్నారు.

రేపటి ఎపిసోడ్ లో నాగచైతన్య రానుండగా ఎల్లుండి అంటే ఆదివారం ఎపిసోడ్ లో మరో గెస్ట్ ను తీసుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ల ర్యాంకింగ్ కోసం క్రియేటివ్ టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వీక్ ఎపిసోడ్ లు ఎంత చేసినా వీక్ గానే ఉంటున్న నేపథ్యంలో వీకెండ్ ఎపిసోడ్స్ అయినా కాస్త గట్టిగా ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. అందుకే నాగార్జున రేపటి ఎపిసోడ్ కు ప్రత్యేకంగా నాగచైతన్య ను తీసుకు వచ్చే అవకాశం ఉంది.