రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన NCB

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో రకరకాల ట్విస్టులు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి సోదరుడు సహా సుశాంత్ సింగ్ వ్యక్తిగత స్టాఫ్ అరెస్టవ్వడం సంచలనమైంది. గత కొద్ది రోజులుగా రియాపైనా సీబీఐ – నార్కోటిక్స్ బృందాలు .. ఈడీ దర్యాప్తు సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూడు టీమ్ లో రియాను మూడోసారి పిలిపించి దర్యాప్తును కొనసాగించాయి. నేడు నార్కోటిక్స్ అధికారుల ముందు రియా హాజరయ్యారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ రోజు రియాను ఎన్.డి.పి.ఎస్ లోని వివిధ విభాగాల కింద అరెస్టు చేశారు. రియా చక్రవర్తి .. ఆమె సోదరుడు షోయిక్ మాదకద్రవ్యాల క్రయవిక్రయాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. ఈ కేసులో మరిన్ని వాస్తవాలను తెలుసుకోవడానికి రియాను అదుపులోకి తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు భావించారు. రియాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవలే రియా సోదరుడు షోయిక్ చక్రవర్తి .. మేనేజర్ శామ్యూల్ మిరాండాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత రియా చక్రవర్తి కుటుంబం ఈ కేసులో తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. సుశాంత్ మరణంలో రియా ప్రమేయం గురించి సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు నిధుల మళ్లింపుపైనా దర్యాప్తు సాగింది. సుశాంత్ సింగ్ క్రెడిట్ కార్డుల వినియోగంపైనా చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.