అప్పుడలా బిస్కెట్ వేసి.. ఇప్పుడిలా ఆఫర్ పట్టేసింది!!

0

మాళవిక మోహనన్.. వెండితెర ప్రేక్షకులకు ఈ పేరు ఇంకా కొత్తే అయినా సోషల్ మీడియాని ఫాలో అయ్యేవారికి మాత్రం మాళవిక ఓ హాట్ ఫేవరేట్. నిత్యం ఏదో ఒక వేడెక్కించే ఫోటోషూట్ తో నెటిజనుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయాలని చూస్తూ వుంటుంది. హాట్ హాట్ ఫొటోలే కాకుండా ఈ మధ్య హాట్ టాపిక్ తో విజయ్ ఫ్యాన్స్ ని రఫ్ఫాడించింది కూడా.

ప్రస్తుతం మాళవిక మోహనన్ స్టార్ హీరో విజయ్ తో కలిసి `మాస్టర్` మూవీలో నటిస్తోంది. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదల కాబోతోంది. ఇంతకుముందు మూవీకి సంబంధించిన కార్టూన్ విషయంలో గొడవకు దిగి రచ్చ చేసింది. దీంతో ఈ అమ్మడి పేరు గూగుల్ ట్రెండ్స్ లో నిలిచింది. నాటి నుంచి సోషల్ మీడియాలో మరింత స్పీడ్ పెంచేసింది మాళవిక.

ప్రస్తుతం `మాస్టర్` రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న మాళవికకు తాజాగా బంపర్ ఆఫర్ లభించింది. రజనీ నటించిన `పేట్ట` చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన మాళవిక మోహననకు తాజాగా ఆయన అల్లుడు ధనుష్ తో కలిసి నటించే అవకాశం దక్కింది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ నటిస్తున్న 43వ చిత్రమిది. ఇందులో అవకాశం దక్కడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది మాళవిక. `ప్రతీ ఇండస్ట్రీలోని ఉత్తమ నటీనటులతో నటించాలని ప్రతీ ఒక్కరికీ వుంటుంది. తమళ్ లో నేను చేయబోయే తదుపరి చిత్రం గురించి తెలియజేయడానికి ఎంతో ఎగ్జైటింగ్గా వుంది` అంటోంది మాళవికా మోహనన్. అన్నట్టు సంక్రాంతి సమయంలో ధనుష్ సరసన నటించాలనుందని అప్పట్లో పబ్లిక్ లోనే ప్రకటించి షాకిచ్చింది. ఇప్పుడిలా తెలివిగా కోరుకున్న ఆఫర్ పట్టేసింది.