హోస్టింగ్ లో మామని బీట్ చేస్తుందా..?

0

దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఈ టాక్ షో ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనుంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో సామ్ ఈ టాక్ షో లో మాట్లాడింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తో కూడా సామ్ మాట్లాడనుంది. తాజాగా చిరంజీవి ఈ షో కి వచ్చిన సందర్భంగా తీసిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అయితే హోస్ట్ గా సమంత తన మామ కింగ్ నాగార్జున ని బీట్ చేస్తుందా అని నెటిజన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ చేసుకుంటున్నారు.

సమంత ఇటీవల ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4కు పార్ట్ టైం హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దసరా స్పెషల్ లో రియాలిటీ షో కి హోస్ట్ గా చేసి సామ్.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ రోజు జరిగిన ఈవెంట్ మంచి టీఆర్పీ కూడా తెచ్చుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ‘సామ్ జామ్’ తో ఫుల్ టైమ్ హోస్ట్ గా మారింది. ఇప్పుడు మెగాస్టార్ ని ఇంటర్వ్యూ చేయనున్న సమంత త్వరలో అల్లు అర్జున్ – తమన్నా భాటియా – రష్మిక మందన్న – సైనా నెహ్వాల్ వంటి సెలబ్రిటీలతో మాట్లాడనుంది. చిరంజీవితో చేసే ఎపిసోడ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సినిమాలు – వెబ్ సిరీస్ లతో అలరిస్తున్న సామ్.. ఇప్పుడు హోస్ట్ గా మామ నాగార్జున కు పోటీ ఇస్తుందేమో చూడాలి.