టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు

0

ఇటీవలే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ హీరో విశ్వంత్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. తక్కువ రేటుకు కార్లు ఇప్పిస్తానంటూ విశ్వంత్ మోసానికి పాల్పడ్డాడు అనేది అభియోగం. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విశ్వంత్ ను విచారించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

పోలీసుల విచారణలో విశ్వంత్ మోసానికి పాల్పడినది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విశ్వంత్ కేరింత.. మనమంత.. జెర్సీ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న విశ్వంత్ పై ఇలాంటి కేసు నమోదు అవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఆయన మోసానికి పాల్పడ్డాడా లేదా అనేది పోలీసులు నిర్థారించాల్సి ఉంది.