మలైక.. కసరత్తులు పూర్తయితే పోన్ లో దూరిపోతోంది!

0

కొందరికి ఫోన్ లేనిదే కాలక్షేపం అవ్వదు. ఏం చేయాలో తోచనే తోచదు. జిమ్ చేసేప్పుడు అదే ధ్యాస ఉంటుంది కొందరికి. కానీ ఫిట్నెస్ ఫ్రీక్ మలైకా అరోరా అలా కాదు. వ్యాయామ క్రమశిక్షణలో తనని కొట్టేవాళ్లే లేరు. జిమ్ యోగా సెషన్స్ లో రూల్స్ ని అతిక్రమించక నిబద్ధతతో ఉంటుంది. స్ట్రిక్ట్ రూల్స్ ని పాటిస్తూ జిమ్ ముగిసిన అనంతరం మాత్రం ఫోన్ లో దూరిపోతుంది. ఇదిగో అలానే ముంబై బాంద్రాలో జిమ్ కి వెళ్లి వస్తూ అలా ఫోన్ మాట్లాడుతూ బిజీ అయిపోయింది.

అలా ఫోన్ లో మాట్లాడుతూ లోకాన్ని మర్చిపోయి వెళుతుంటే జిమ్ వెలుపల కుర్రాళ్ల కళ్లు మాత్రం అటే లాక్ అయిపోయాయి మరి. అసలే టైట్ ఫిట్ డ్రెస్ లో మలైకం మత్తులోకి దించేస్తోంది. వయసు 50కి చేరువవుతున్నా.. ఈ భామలో టీనేజీ యవ్వారం మతులు చెడగొట్టేస్తోంది అంటూ ఒకటే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రతిరోజూ మలైకా యోగా స్టూడియోలో వ్యాయామానికి వెళుతుంది. కొన్నిసార్లు యోగా బ్రేక్ లో ఫోన్ మాట్లాడాల్సి రావడం విసిగించేస్తోందట. దీని గురించి మాట్లాడుతూ… మంగళవారం ఉదయం.. యోగాకు బదులుగా.. మలైకా ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

ఫోటోలలో మలైకా బూడిద రంగు టైట్స్ .. స్నీకర్లతో తెల్లటి ట్యాంక్ టాప్ ని ధరించి కనిపించింది. ఆ చేతిలో వాటర్ బాటిల్ ఉంది. క్లాస్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ ని ధరించింది. అలా వెళ్లేప్పుడు ఆమె తన కారుకు చేరే వరకు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది. అటుపై కార్ లో ఇంటికి వెళ్ళింది. టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన విజయాన్ని మలైకా సెలబ్రేట్ చేసుకుంది. నేటితో సిరీస్ ని 2-1 తేడాతో గెలవడం ఆనందాన్నిచ్చిందని మలైకా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది.