చైతూ సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ క్యూట్ స్టిల్

0

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా ముగిసింది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని శేఖర్ కమ్ముల భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ ఏడాదిలో లవ్ స్టోరీ వచ్చే అవకాశం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. సినిమాపై అంచనాలను పెంచేలా మేకర్స్ ఒకొక్క స్టిల్ చొప్పున విడుదల చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ మరియు పాటలతో పాటు నేడు దసరా సందర్బంగా ఒక క్యూట్ స్టిల్ ను విడుదల చేశారు. సాయి పల్లవికి చైతూ పట్టీలు పెడుతున్న ఈ స్టిల్ చాలా నాచురల్ గా బాగుంది అంటూ టాక్ దక్కించుకుంది. శేఖర్ కమ్ముల ఫిదా సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయన నుండి సినిమా రాలేదు. మళ్లీ ఫిదా చేసేందుకు గాను ఈ సినిమాతో రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఫొటోలు మరియు వీడియోలను చూస్తుంటే సాయి పల్లవితో ఖచ్చితంగా మరో విజయాన్ని శేఖర్ కమ్ముల కొట్టడం ఖాయం అనిపిస్తుంది. దసరా సందర్బంగా విడుదలైన ఈ స్టిల్ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు పెంచేసింది. అన్ని సరిగా ఉంటే వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.