పెళ్లి పై నమ్మకం లేకున్నా వీసా కోసం చేసుకున్న అంటున్న బాలయ్య హీరోయిన్

0

బాలకృష్ణ తో లెజెండ్ మరియు లయన్ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే ఇంకా పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించింది. ఈమద్య కాలంలో పూర్తిగా బాలీవుడ్ కు పరిమితం అయ్యింది. అక్కడ వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఈ అమ్మడి పెళ్లి విషయం కొన్నాళ్లుగా హాట్ టాపిక్ అయ్యింది. ఈమెకు పెళ్లి అయిన విషయంను ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా దాచి పెట్టింది. ఈమద్య పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ లేని కారణంగా లండన్ లో భర్త బెనెడిక్ట్ టేలర్ తో ఎంజాయ్ చేస్తుంది.

లండన్ లో ఉన్న రాధిక ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను విదేశాలకు ప్రయాణించేందుకు గాను వీసా సమస్య రాకూడదనే ఉద్దేశ్యంతో లండన్ కు చెందిన బెనెడిక్ట్ ను వివాహం చేసుకున్నట్లుగా చెప్పింది. ఇద్దరం కూడా అవగాహణతో ఒకరి కెరీర్ గురించి ఒకరం ఆలోచిస్తూ సమర్థించుకుంటూ ఉంటాం. అందుకే మేము ఇన్నాళ్లు అయినా కూడా విడివిడిగా ఉంటున్నాం అంది. పెళ్లి అనే వ్యవస్థ మరియు పద్దతిపై అసలు నాకు నమ్మకం లేదు. కాని జీవితంలో ఒక సన్నిహితుడు ఉండాలని అలాగే విదేశాల్లో తిరిగేందుకు విదేశీయుడిని పెళ్లి చేసుకుంటే వీసా ఈజీగా వస్తుందనే ఉద్దేశ్యంతో బెనెడిక్ట్ ను పెళ్లి చేసుకున్నట్లుగా బోల్డ్ గా చెప్పేసింది.