‘నేను ప్రామిస్ చేసినట్లు నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను’

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ – 19 నిబంధనలను అనుసరిస్తూ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరణను ప్రారంభించేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేస్తూ.. సినిమా కోసం ఉపయోగిస్తున్న వెపన్స్ మరియు వెహికల్స్ ని చూపించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ‘రామరాజు ఫర్ భీమ్’ స్పెషల్ టీజర్ అక్టోబర్ 22న విడుదల కాబోతున్నట్లు ప్రకరించారు.

కాగా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు చాలా ఉత్సాహంగా ఉన్నామని పేర్కొన్నారు. ”ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. డియర్ బ్రదర్ తారక్.. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది రెడీ అవుతోంది. నేను ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు బెస్ట్ ఇవ్వబోతున్నాను” అని చరణ్ ట్వీట్ చేశాడు. ”ఆర్.ఆర్.ఆర్ సెట్స్ మీదకు రావడం చాలా ఉత్సాహంగా ఉంది జక్కన్న. ఫైనల్లీ చరణ్ బ్రో.. వెయిట్ చేయలేకపోతున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ”జీవితం ఇప్పటికే న్యూ నార్మల్ గా మారుతోంది. దానికి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. కాబట్టి మా షూట్ తిరిగి ప్రారంభమయింది” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.