‘వన్ అరేంజ్డ్ మర్డర్’.. సుశాంత్ గురించేనా?

0

Chetan Bhagat One Arranged Murder

Chetan Bhagat One Arranged Murder

చేతన్ భగత్.. భారతదేశంలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్టు స్క్రీన్ ప్లే రచయితగా పేరుంది. ఈయన రాసిన నవల ఆధారంగానే అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా తీశాడు. గ్రాండ్ హిట్ అందుకున్నాడు. ఇంకా చాలా సినిమాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డులు అందుకున్నారీయన..

చేతన్ భగత్ ప్రస్తుతం సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గానే కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా దైనిక్ భాస్కర్ వంటి పత్రికలలో కాలమ్స్ రాస్తుంటారు. ఆంగ్లంలో ఈయన రాసిన నవలలు పుస్తకాలు యువతకు చాలా చేరువయ్యాయి. దేశంలోనే ప్రముఖ రైటర్ గా ఈయనకు పేరుంది.

అయితే తాజాగా చేతన్ భగత్ ఓ పుస్తకం రాస్తున్నారనే వార్తలు వచ్చాయి. తాను ‘వన్ అరేంజ్డ్ మర్డర్’ అనే పేరుతో పుస్తకం రాస్తున్నట్టుగా చేతన్ భగత్ తెలిపారు. రేపు తన కొత్త పుస్తకం కవర్ ను విడుదల చేస్తానని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు.

కాగా దీనిపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలోనే చేతన్ భగత్ ఈ పుస్తకం రాస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో రేపు విడుదల చేయబోయే ఈ పుస్తకం కవర్ లో ఏం ఉంటుందనే దానిపై బోలెడు చర్చ జరుగుతోంది.