
Kalyani Priyadarshan and Pranav Relationship
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ – సీనియర్ నటి లిస్సి లక్ష్మి కూతురు కళ్యాణి ప్రియదర్శి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో పరిచయమైన కళ్యాణి ప్రియదర్శి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ ‘రణరంగం’ చిత్రాల్లో నటించింది. అయితే కళ్యాణి ప్రియదర్శికి ‘హలో’ సినిమాలో లవ్ స్టోరీ లాంటిదే రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఉందని చాలా రోజులుగా రూమర్స్ ఉన్నాయి. ‘హలో’ సినిమాలో చిన్నప్పటి స్నేహమే వయసుతో పాటు పెరిగి వారిలో ప్రేమగా మారుతుంది. ఇదే స్టోరీ కళ్యాణి జీవితంలో కూడా ఉందని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
కాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ – డైరెక్టర్ ప్రియదర్శన్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. వీరి సతీమణులు లిస్సి – సుచిత్ర మోహన్ లాల్ కూడా క్లోజ్ గా ఉంటారు. ఈ క్రమంలో వీరి పిల్లలైన ప్రణవ్ మోహన్ లాల్ – కళ్యాణి ప్రియదర్శి కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. చిన్ననాటి ఆ స్నేహమే ఇప్పుడు ప్రేమగా పెరిగి పెద్దదైందంటున్నారు. ఇద్దరూ కలిసి దిగిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే వీరి రేలషన్ షిప్ పై ఇద్దరూ ఇంతవరకు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల మోహన్ లాల్ వీరి రేలషన్ షిప్ పై మాట్లాడారట.
మలయాళ సూపర్ స్టార్ మాట్లాడుతూ ప్రణవ్ – కళ్యాణి ఇద్దరూ ప్రియదర్శన్ తన లాగే స్నేహితులని చెప్పుకొచ్చాడట. ఇద్దరు ఫ్రెండ్స్ సెల్ఫీలు తీసుకున్నంత మాత్రాన వారి మధ్య ఏదో సంబంధం ఉందని ఎలా అర్థం చేసుకుంటారని మోహన్ లాల్ ప్రశ్నించారట. ఇప్పటి నుంచైనా ఇలాంటి అనవసరమైన వివాదాలు సృష్టించడం మానేయాలని ఆయన కోరారట. కాగా కళ్యాణి ప్రియదర్శన్ గత నెలలో ప్రణవ్ బర్త్ డే నాడు వాళ్లిద్దరూ దిగిన చిన్నప్పటి ఫోటో షేర్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది. ”నువ్వు ఇది చూడటానికి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండవని నాకు తెలుసు. కానీ ‘నువ్వు ఎందుకు ప్రణవ్ కి విషెస్ చెప్పలేదు’ అని అడిగేవారి కోసం విష్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్ డే. ఈ ఫొటోలో కనిపిస్తున్నప్పటి నుండి చాలా పెద్ద వాడివయ్యావు. మన చిన్ననాటి రోజులకి వెళ్తే బాగుండు అనుకుంటాను. దురదృష్టవశాత్తు మనం చాలా తెలివైనవాళ్ళం అయ్యాము.. ఇంకా అవుతున్నాం. నీతో కలిసి షూటింగ్ లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని పోస్ట్ పెట్టింది.
ఇదిలా ఉండగా కళ్యాణి ప్రిదర్శన్ – ప్రణవ్ మోహన్ లాల్ ఇద్దరూ కలిసి ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ప్రిదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ వార్ ఫిలింలో మోహన్ లాల్ – కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో పాటు ‘హృదయం’ అనే సినిమాలో కూడా ప్రణవ్ – కళ్యాణి కలిసి నటిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఈ జంట రాబోయే రోజుల్లో వీరి బంధంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
