Templates by BIGtheme NET
Home >> Cinema News >> చిరు బర్త్ డే స్పెషల్ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ గ్లిమ్స్ విడుదల…!

చిరు బర్త్ డే స్పెషల్ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ గ్లిమ్స్ విడుదల…!


మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ చేయడానికి మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు జరిపే అవకాశం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సంబరాలు స్టార్ట్ చేసారు. చిరు పుట్టినరోజుకి చాలా రోజుల ముందు నుంచే #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ట్విట్టర్ ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ బర్త్ డే ని మరింత స్పెషల్ గా జరపాలని డిసైడ్ అయింది. చిరు బర్త్ డే కానుకగా ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ పేరుతో ఓ స్పెషల్ ర్యాప్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలో లేటెస్టుగా బాస్ బర్త్ డే స్పెషల్ అంటూ ‘మెగాస్టార్స్ మెగా ర్యాప్’ సాంగ్ గ్లిమ్స్ విడుదల చేసారు. ‘ఎవరీబడీ ట్యూన్ ఇన్ టూ ది బీట్..’ అంటూ సాగిన ఈ ర్యాప్ గ్లిమ్స్ లో మెగా ఫ్యాన్స్ ‘జై చిరంజీవ’ ప్లాగ్స్ తో చిరు ఫేస్ మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. ఈ మెగా ర్యాప్ పూర్తి సాంగ్ ని చిరంజీవి బర్త్ డే ముందురోజు అంటే ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాప్ సాంగ్ ని వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించగా సురేంద్ర ర్యాప్ ఆలపించారు.