కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

0

Former Indian Cricketer Chetan Chauhan Is No More

Former Indian Cricketer Chetan Chauhan Is No More

భారత క్రికెట్ లో విషాదం అలుముకుంది. భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. జూలై 12న చేతన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆసుపత్రిలో చేరారు.

అయితే చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంతకు తరలించారు.

అయితే కరోనాకు ముందే ఆయనకు జీపీతోపాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఆయన చికిత్స పొందుతున్నారు.

తాజాగా కరోనాతో చేతన్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఆయన శరీరంలోని చాలా అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కొద్దిసేపటి క్రితం చనిపోయారు.

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో చౌహాన్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. భారత్ తరుఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్.. సునీల్ గవర్నర్ తో కలిసి ఓపెనర్ గా ఇండియా టీంలో బరిలోకి దిగేవాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ లో పలు హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ఉంటున్నారు.