‘గుండు బాస్’ గా బిగ్ బాస్.. మెగాస్టార్ లుక్ చూస్తే షాకవ్వాల్సిందే…!

0

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య తన లుక్స్ తో వేరియేషన్స్ చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా కోసం స్లిమ్ గా మారిన చిరంజీవి.. ఇటీవల క్లీన్ షేవ్ లో మీసాలు లేకుండా కనిపించి ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యపరిచాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో పోస్ట్ చేసి మరోసారి షాక్ ఇచ్చాడు మెగాస్టార్. అయితే ఈ లుక్ మాత్రం ఎవరూ ఉహించిందని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఈ ఫొటోలో గుండుతో కనిపిస్తున్నాడు. ”నేను సన్యాసిలా ఆలోచించగలనా?” అని ఆ ఫొటోకు #UrbanMonk అనే క్యాప్షన్ ను జత చేసాడు. ‘గుండు బాస్’ గా మారిన బిగ్ బాస్ ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మెగాస్టార్ ఇచ్చిన సర్ప్రైజ్ లుక్ చూసిన మెగా అభిమానులు ‘అది మేకప్ ఏమో’ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. ‘ఏదేమైనా మన బాస్ గుండు బాస్ లుక్ సూపర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ లుక్ ప్రస్తుతం చిరు నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా కోసమా.. లేదా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. లేదంటే చిరు నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో గెటప్ టెస్ట్ చేస్తున్నారా.. మరేదైనా కారణం ఉందా అనేది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం మెగాస్టార్ గుండుతో ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.