కంగనా వై ప్లస్ కి నా డబ్బులు ఎంత వినియోగిస్తున్నారన్న నటి

0

ముంబయిలో అడుగు పెట్టనివ్వం అంటూ శివసేన కార్యకర్తలు కంగనాను హెచ్చరించిన నేపథ్యంలో ఆమె సెక్యూరిటీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఏకంగా వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించిన విషయం తెల్సిందే. ఒక నటికి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వడం మొదటి సారిగా చెబుతున్నారు. కంగనాకు ముప్పు ఉన్న కారణంగా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడం మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో కేంద్రంను మరియు కంగనాను విమర్శిస్తున్నారు. ప్రజల సొమ్ముతో ఒక నటికి వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడం ఏంటీ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ విషయమై నటి కుబ్రా సైథ్ స్పందిస్తూ.. ఈ సెక్యూరిటీ కోసం ఖర్చు చేస్తున్నదాంట్లో నేను కడుతున్న ట్యాక్స్ లు ఎంత ఉన్నాయి. కేంద్రం నా డబ్బులు ఎన్ని ఇందుకు ఉపయోగిస్తుంది అంటూ ఆమె ప్రశ్నించింది. కుబ్రా ట్వీట్ కు రంగోలీ కాస్త తీవ్రంగానే స్పందించింది. ఉత్సుకతతో అడుగుతున్న నువ్వు ప్రభుత్వంకు ఎంత ట్యాక్స్ చెల్లిస్తున్నావు కుబ్రా అంటూ రంగోలీ కౌంటర్ ఇచ్చింది. కంగనా సెక్యూరిటీ విషయంలో సోషల్ మీడియాలో రకరకాలుగా మీమ్స్ వస్తున్నాయి. పేదవాడి గురించి పట్లని ప్రభుత్వాలు ఇలా సెల్రబెటీల కోసం పదుల సంఖ్యలో సెక్యూరిటీకి ఖర్చు చేయడం ఏంటో అంటున్నారు. ఆమెకు ఉన్న డబ్బుతో అంతకు మించిన సెక్యూరిటీని ఏర్పర్చుకుంటుంది కదా ప్రభుత్వం ఎందుకు ఆమెకు ప్రత్యేకంగా సెక్యూరిటీ కల్పించాల్సి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.