కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు సాయంగా నిలబడి వారిని వారి వారి సొంత ప్రాంతాలకు తరలించేందుకు తన వంతు కృషి చేసిన సోనూసూద్ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యాడు. ప్రస్తుతం సినిమాల్లో ఈయన బిజీగా ఉన్నా కూడా తాను చేసిన సేవా కార్యక్రమాలపై ఒక పుస్తకంను సోనూసూద్ వేయించాడు. ఐయామ్ నో మెస్సయ్యా అంటూ రాసుకున్న పుస్తకంను ఆచార్య షూటింగ్ సెట్ లో చిరంజీవికి సోనూసూద్ అందించారు. చిరంజీవి ఆ బుక్ అమెజాన్ లో కొనుగోలు చేసేందుకు లింక్ ను షేర్ చేశారు. ఈ సందర్బంగా సోనూసూద్ పై చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.
సాదారణంగా హీరోలు పుట్టరు. ఎవరైనా కూడా వారు చేసే గొప్ప కార్యక్రమాల ద్వారానే హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఆపద కాలంలో వేలాది మందిని అక్కున చేర్చుకుని గొప్ప మనసుని చాటుకుని హీరో అయ్యావు. నీవు చేసిన పనులు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. ముందు ముందు కూడా నీవు అందరికి ఆదర్శణీయంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి పేర్కొన్నాడు. ఆచార్య సినిమాలో చిరంజీవి మరియు సోనూసూద్ ల సీన్ ల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. మరో వైపు అల్లుడు అదుర్స్ లో కూడా సోనూసూద్ నటిస్తున్నాడు. భారీగా పారితోషికం పెంచడంతో పాటు సోనూసూద్ హీరోగా నటించేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు. త్వరలోనే నిర్మాతగా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తెలియజేశాడు.