నాన్న కూచీనే ఈ మెగా డాటర్

0

కుమార్తెలతో మెగాస్టార్ చిరంజీవి అనుబంధం గురించి చెప్పాల్సిన పనే లేదు. సుస్మిత .. శ్రీజ ఇద్దరు కూతుళ్లు అంటే రెండు కళ్లు. ఇక సుస్మిత ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ వ్యవహారాలు చూస్తూనే సొంతంగా మరో బ్యానర్ ని స్థాపించి ఇందులో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. నవతరం ట్యాలెంట్ కి అవకాశాలిస్తూ మునుముందు సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు శ్రీజ బిజినెస్ మేన్ కళ్యాణ్ దేవ్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ – శ్రీజ జంటకు ఒక కుమార్తె జన్మించారు. ఇక కళ్యాణ్ సినిమాలతో హీరోగా బిజీ అవుతున్నారు. ఇక పండగలు పబ్బాల వేళ చిరంజీవితో కలిసి ఇంటిల్లిపాదీ సెలబ్రేషన్స్ చేస్తుంటారు. ఆ ఫోటోల్ని చిరు స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేస్తుండడంతో ఫ్యాన్స్ లో అంతే స్పీడ్ గా వైరల్ అవుతున్నాయి. చరణ్.. సుస్మిత.. శ్రీజలతో అనుబంధానికి సంబంధించిన ఫోటోలు ఇదివరకూ ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లాయి.

అలాగే చిన్న కుమార్తె శ్రీజతో చిరు అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. అందుకు సింబాలిక్ గా ఉన్న ఓ ఫోటోని చిరు తాజాగా ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేశారు. శ్రీజ తన తండ్రితో ఎంతో ఆప్యాయంగా ఫోటో దిగారు. తన తండ్రి శిరస్సునకు తన తలను ఆన్చి ఆ ఫోటోలో ముచ్చటగా కనిపిస్తున్నారు. అచ్చం తండ్రి నోటి నుంచి ఊడిపడ్డట్టే ఉంది! అని కామెంట్లు పడుతున్నాయ్.