అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలని నటుడు

0

స్టార్ కమెడియన్ అలీ మూడు దశాబ్దాల కెరీర్ ఓ రికార్డ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. బాలనటుడిగా ప్రారంభమైన ఆయన ఇప్పటి వరకు సుమారు వెయ్యి సినిమాలు చేశారు. ప్రఖ్యాత కమెడియన్ గా ఎటువంటి విరామం లేకుండా టీవీ షోలు కూడా చేస్తున్నాడు. పరిశ్రమలో అత్యంత వైభవోపేతమైన జీవితాన్ని గడిపిన వాడిగా అందరి నాలుకలో వ్యక్తిగా ఉంటాడు. బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్లు ఎటువంటి ఆఫర్లు లేకుండా ఉన్నారు. కాని అలీ రాక్ సాలిడ్.

అలీ తన కెరీర్ ను చాలా కచ్చితంగా ప్లాన్ చేశాడు కాబట్టే ఈ స్థాయి దక్కిందని అర్థం చేసుకోవచ్చు. ఏ క్షణం అయితే ఆఫర్లు తగ్గడం ప్రారంభమైందో ఆ క్షణం అతను తన దృష్టిని టీవీకి మరల్చాడు. అది పెద్ద రేంజులో వర్కవుటైంది. బుల్లితెర హోస్ట్ గా చాలా కాలంగా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు. అతని లేటెస్టు షో `అలీతో సరదగా` ఈటీవీలో అతిపెద్ద విజయం సాధించిన షోగా నిలిచింది.

అలాగే టైమ్ చూసి ఇప్పుడు యమలీలా అనే టెలి సీరియల్ వైపు ఒక షిఫ్ట్ చేసాడు. అక్కడా బిజీగా ఉన్నాడు. అతను ఈ రోజుల్లో అన్ని కామెడీ షోలు .. ఈవెంట్లు చేస్తూ జోష్ తో ఉన్నాడు. అందివచ్చిన ఎటువంటి అవకాశాన్ని వదలడం లేదు. ఇలా చేయడం ద్వారా అలీ తన కెరీర్ ను తగినంతగా పొడిగించడమే కాకుండా.. ఇండస్ట్రీలో ఇంకా తన హవా తగ్గలేదని ప్రూవ్ చేస్తున్నాడు. వర్థమాన నటీనటులంతా వారి కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలో పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఎందరికో స్ఫూర్తిని నింపుతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.