అందమైన హంసా ఆరుబయట వంట

0

అందాల హంసానందిని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు చేసిన సినిమాలు మరియు ఐటెం సాంగ్స్ ఈమెపై జనాల్లో అభిమానంను పెంచింది అనడంలో సందేహం లేదు. అయితే అదృష్టం బాగాలేకపోవడం వల్లో లేదా మరేంటో కాని ఈ అమ్మడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. అందం.. ఫిజిక్.. మంచి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పలికించే సత్తా ఉన్నా కూడా ఈమెకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈగ సినిమాలో ఈమె చేసింది చిన్న రోల్ అయినా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఈమె చేసిన ఐటెం సాంగ్స్.. ప్రత్యేక పాత్రలు ఈమెను ఎప్పటికి గుర్తుండేలా చేసింది.

సినిమాలతో కాస్త దూరంగా ఉంటున్నట్లుగా అనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాతో మాత్రం అభిమానులు మరియు ఫాలోవర్స్ కు టచ్ లో ఉంటుంది. ఈమె ఎప్పుడు కూడా తన ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఆరు బయట కొండ ప్రాంతంలో పాస్తా రెడీ చేసిన చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేసింది. బ్యూటీఫుల్ హంసా నందిని ఒక మినీ ఫ్రాక్ వేసుకుని వావ్ అనిపించే స్కిన్ టోన్ తో చాలా హుషారుగా వంట చేసి ఆ వంటనే ఆస్వాదించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీకెండ్ లో ఈ వంట చేసినట్లుగా చెప్పింది. మొదటి సారి పాస్త చేశానంటూ ఈ అమ్మడు తన ఆనందంను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.