భార్యపై జోక్ చేసిన కంటెస్టెంట్.. అమితాబ్ సీరియస్!

0

అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ ‘బిగ్ బి’గా.. దేశ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అప్పుడెప్పుడో 70వ దశకం నుంచి ఇప్పటిదాకా ఎవర్ గ్రీన్ హీరోగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. తన విలువలు కట్టుబాట్ల విషయంలో అమితాబ్ ఇప్పటికీ కట్టుబడి ఉంటారు. గౌరవ మర్యాదల విషయంలో ఇప్పటికీ వెనక్కి తగ్గరు.

తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా బారినపడ్డారు. అతి కష్టం మీద కోలుకున్నారు. ఇటీవలే అనారోగ్యం నుంచి కోలుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమంలో బిజీ అయ్యారు. ప్రస్తుతం 12వ సీజన్ నడుస్తోంది.

ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఓ వ్యక్తి తన భార్య గురించి చేసిన కామెంట్ పై అమితాబ్ కాస్తా సీరియస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గెలిచిన ప్రైజ్ మనీతో ఏం చేస్తారని సదురు కంటెస్టెంట్ ను అమితాబ్ ప్రశ్నించారు.

దీనికి స్పందించిన ఆ కంటెస్టెంట్.. ‘15 ఏళ్లుగా నా భార్య ముఖం చూసి విసుగొచ్చింది. ప్రైజ్ మనీతో ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని’ సెటైరికల్ గా అన్నాడు.

దీనికి సీరియస్ అయిన అమితాబ్ బచ్చన్ ‘సరదాకి కూడా ఇలాంటి మాటలు అనకండి’ అంటూ హితవు పలికారు. అలాగే ఈ కార్యక్రమంలో మీ భర్త మాటలను సీరియస్ గా తీసుకోకండని సదురు కంటెస్టెంట్ భార్యకు సూచించాడు.