Templates by BIGtheme NET
Home >> Cinema News >> `కరోనావైరస్`ను థియేటర్లలోకి వదులుతున్నాడట

`కరోనావైరస్`ను థియేటర్లలోకి వదులుతున్నాడట


ఓవైపు కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఒణికిస్తుంటే అదేమీ పట్టనట్టు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తెరకెక్కిస్తూ తన రూటే సపరేటు అని నిరూపించాడు ఆర్జీవీ. అవన్నీ ఇటీవల ఒకటొకటిగా రిలీజ్ కి వస్తున్నాయి. కొన్ని కోర్టు వివాదాలతో ఆగిపోగా.. మరికొన్నిటిని పూర్తి చేసి రిలీజ్ లకు తెస్తున్నారు.

తదుపరి తన అస్త్రాల్లోంచి `కరోనావైరస్`ను థియేటర్లలోకి వదులుతున్నాడట. డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రం ఇదేనంటూ దర్శకనిర్మాత ఆర్జీవీ ప్రకటించారు. రాష్ట్రంలో 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ప్రకటనను వెలువరించారు. డిసెంబర్ 11 న థియేటర్లలో విడుదలకు వస్తోందని ఆర్జీవీ ప్రకటించారు.

కరోనావైరస్ రియల్ లైఫ్ హర్రర్ చిత్రమని ఆర్జీవీ చెబుతున్నారు. కొంతవరకూ లాక్ డౌన్ సమయంలోనే చిత్రీకరణ పూర్తి చేశారు. అగస్త్యమంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అందమైన మధ్యతరగతి కుటుంబంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించాక ఎలాంటి టెన్షన్ వాతావరణం అలుముకుంది? ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ముందు కుటుంబీకులు ఎలా భయపడ్డారు? సామాజికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నది తెరపై చూపిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

సినిమా ఆద్యంతం అదే టెన్షన్ తో గ్రిప్పింగ్ గా చూపిస్తే జనాలకు కనెక్టవుతుందేమో! ఇటీవల RGV ఫీచర్ ఫిలిమ్స్ ని లఘు చిత్రాల తరహాలో తెరకెక్కించి రిలీజ్ చేయడం చర్చకు వచ్చింది. తనకు గిట్టనివాళ్లను టార్గెట్ చేస్తూ సెటైరికల్ షార్ట్స్ తెరకెక్కించడంపై రివర్్ కౌంటర్లు పడ్డాయి. అదే కోవలోనే కొరోనావైరస్ అనే చిత్రాన్ని పరిమిత బడ్జెట్లో తెరకెక్కించి విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు.