Templates by BIGtheme NET
Home >> Cinema News >> గ్రామీ రేసులో భారత సంతతి యువతి.. సింగర్ ప్రియదర్శిని నామినేట్

గ్రామీ రేసులో భారత సంతతి యువతి.. సింగర్ ప్రియదర్శిని నామినేట్


ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామీ పురస్కారానికి భారత సంతతి యువతి సింగర్ ప్రియదర్శిని నామినేట్ అయింది. ఏడాది జనవరి 31 న లాస్ ఏంజిల్స్ లో 63వ గ్రామీ వేడుకలు జరగనున్నాయి. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ కేటగిరీలో ప్రియదర్శిని తొలి ఆల్బమ్ పెరిఫెరీ చోటు దక్కించుకుంది. కర్ణాటక సంగీతం అమెరికన్ పాప కలయికలో వచ్చిన ఈ ఆల్బమ్ విడుదలైన సమయంలో సంచలనం సృష్టించింది. సంగీత ప్రియుల్ని అప్పట్లో ఆకట్టుకున్న ఈ ఆల్బమ్ ఇప్పుడు గ్రామీ నామినేషన్స్ కు ఎంపికైంది.

ముంబై లో స్థిరపడిన తమిళ కుటుంబం. ఆమె అమ్మమ్మ భరతనాట్య కళాకారిణి. శాస్త్రీయ సంగీతం గాయకురాలు కూడా. ఆమె ప్రోత్సాహంతోనే ప్రియదర్శిని నాలుగేళ్ల వయస్సు నుంచి కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. చిన్న వయసులోనే కచేరీల్లో కూడా పాల్గొంది. ఆ తర్వాత వివిధ రకాల సంగీతాన్ని అభ్యసించారు. న్యూయార్క్ లో సెటిలైన ప్రియదర్శిని అక్కడి పాశ్చాత్య సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. దాదాపు 100కు పైగా రేడియో టీవీ వాణిజ్య ప్రకటనలకు పలు సినిమాల్లో సౌండ్ ట్రాక్ లకు తన గళాన్ని అందించారు.

పెరల్ జామ్ జాక్ షిమబుకురో రాయ్ ఫ్యూచర్మేన్ వూటెన్ ఫిలిప్ లాసిస్టర్ జెఫ్ కఫిన్ వంటి ప్రముఖ సంగీత కళాకారులతో ప్రియ దర్శిని పని చేశారు. ఎపీకోరస్ బ్యాండ్ కు భాగస్వామి కూడా. ప్రియదర్శిని ట్రయో అనే బ్యాండ్ను కూడా ఆమె స్వయంగా ప్రారంభించారు.

తాజాగా గ్రామీ అవార్డులకు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బం విభాగంలో ప్రియదర్శిని తొలి ఆల్బమ్ పెరిఫెరీ నామినేట్ కావడంతో ప్రియదర్శిని పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ ఆల్బంలో తొమ్మిది పాటలున్నాయి. ఈ పాటలన్నీ కర్ణాటక సంగీతం అమెరికన్ పాప్ సమ్మేళనంతో ఉన్నాయి. గ్రామీ అవార్డు అంటే సంగీత ప్రపంచంలో అత్యున్నత స్థాయి అవార్డు. ఈసారి ఈ అవార్డుకు ప్రియదర్శిని తోపాటు గతంలో ఐదుసార్లు ఇదే అవార్డుకు నామినేట్ అయిన అనౌష్కా శంకర్ కూడా పోటీలో ఉన్నారు. మరి గ్రామీ అవార్డు ఏ సింగర్ కి దక్కుతుందో వేచి చూడాలి.