బూతు డైలాగ్స్ తో రవిబాబు ‘క్రష్’ ఫస్ట్ పీప్…!

0

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రష్’. ఈ సినిమాని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. అభయ్ సింహా – కృష్ణ బూరుగుల – చరణ్ సాయి – అంకిత మనోజ్ – పర్రీ పాండే – శ్రీ సుధారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ‘అన్ లాక్ 1.0’ పేరుతో ఈ మధ్య విడుదలైన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ఫస్ట్ పీప్’ పేరుతో 3 నిమిషాల 13 సెకన్ల నిడివి గల ఓ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

కాగా ‘ఈ వీడియో 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రేక్షకుల అభీష్టానుసారం ఉద్దేశించబడింది’ అంటూ ప్రారంభంలోనే ‘క్రష్’ ఫస్ట్ పీప్ ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ”అమెరికా రావాలనుకుంటే బాడీలో ఏ పార్ట్ ఎందుకుందో దాన్ని ఎలా వాడాలో బాగా తెలుసుకొని టెస్ట్ చేసి కాన్ఫిడెంట్ అయితేనే ఫ్లైట్ ఎక్కండి.. సెక్సువల్ నాలెడ్జ్ లేకుండా అమెరికా వెళ్లడం కన్నా ఎవడిది వాడు ఊపుకుంటూ ఇండియాలో ఉండటమే బెటర్” అనే డైలాగ్ తో రవిబాబు ఈ సినిమాలో కంటెంట్ గురించి చెప్పాడు. ‘ఫస్ట్ టైం అమ్మాయిని చూసిన వెంటనే టంగ్ మనిపించింది’.. బ్రేక్ ఫాస్ట్.. ఫుల్ మీల్స్ అంటూ అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయింది.

‘క్రష్’ ఫస్ట్ పీప్ లో టీనేజ్ సెక్స్ గురించి.. వారిలో కలిగిన ఫీలింగ్స్ గురించి.. ఫారెన్ వెళ్లాలనుకునే ముగ్గురు కుర్రాళ్ళు తమ ప్రియురాళ్ళతో చేసే రొమాన్స్ గురించి రవిబాబు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో వివరించాడు. ఫస్ట్ పీప్ చివర్లో డైరెక్టర్ రవిబాబు కనిపించడం విశేషం. ఈ సినిమాకి నివాస్ యూత్ ని ఆకట్టుకునే డైలాగ్స్ అందించాడు. రవిబాబు నుంచి ఈ రేంజ్ లో బూతు డైలాగ్స్ తో సినిమా రావడం ఇదే మొదటిసారి చెప్పవచ్చు. గతంలో కొన్ని సినిమాల్లో గ్లామర్ టచ్ ఇచ్చినా ‘క్రష్’ లో ఏకంగా సెక్స్ ఎడ్యుకేషన్ గురించి నేర్పిస్తున్నాడు. మొత్తం మీద ఈ చిత్రంతో రవిబాబు టీనేజ్ యువతలోని కోరికలు.. ప్రస్తుతం యువతరం ఆలోచనలు చూపించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ‘క్రష్’ ఫస్ట్ పీప్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అడల్ట్ కంటెంట్ తో ‘ ఏ’ సర్టిఫికేట్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.