క్యూట్ ఇల్లీ బేబీ స్మైల్ కి పడిపోనిది ఎవరు?

0

సన్నజాజి తీగ నడుముతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జిల్లనిపించింది ఇలియానా. దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైనప్పుడు ఇలియానా అప్పుడే టీనేజీ వయసు దాటి మిసమిసలతో ఆకట్టుకుంది. వైవియస్ ఆ అందానికి ఆ అందమైన నవ్వు నడుము సొగసు చూసి ముగ్ధుడై రామ్ సరసన ఎంపిక చేశానని అన్నారు.

అదంతా సరే కానీ.. ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఇలియానా బాల్యంలో ఎలా ఉండేది? అన్నది తెలియాలంటే ఇదిగో ఈ ఫోటో చూడాల్సిందే. తాజాగా ఇలియానా తన చిన్ననాటి త్రోబాక్ ఫోటోని అభిమానుల కోసం సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి ఒక ఫన్నీ టైటిల్ కూడా ఇచ్చింది. వైట్ అండ్ వైట్ డిజైనర్ ఫ్రాకులో ఇల్లీ బేబీ సో క్యూట్ గా కనిపిస్తోంది. ఇక తనతో పాటే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? స్కూల్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.

ఇలియానా కెరీర్ సంగతి చూస్తే.. 1992లో భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఆధారంగా అజయ్ దేవ్ గన్ నిర్మిస్తున్న `ది బిగ్ బుల్`లో నటిస్తోంది. అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు.