వింక్ గర్ల్ కొత్త అవతారం మత్తెక్కిస్తోందిగా..

0

ఒక్క కన్నుగీటుతో కుర్రకారు హృదయాల్ని లయ తప్పేలా చేసింఇ మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. `ఒరు ఆదార్ లవ్` సినిమాలోని ఆ ఒక్క యాక్ట్ తో దేశ వ్యాప్తంగా సెన్సేషనల్ గాళ్ గా పాపులరైంది. దీంతో హీరోయిన్ గా పలు చిత్రాల్లో క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్ తాజాగా కొత్త అవతారం ఎత్తబోతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా వున్నా ఈ క్రేజీ లేడీ కొత్తగా సింగర్ అవతారం ఎత్తబోతోంది.

హిందీలో రూపొందుతున్న ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో ఈ బ్యూటీ ఆడి పాడబోతోందట. దీనికి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కర్లు కొడుతున్నాయి. `ఒరు ఆదార్ లవ్`లో తనలో వున్న రొమాంటిక్ యాంగిల్ ని మాత్రమే బయటపెట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజా ఆల్బమ్ లో తన గ్లామర్ షోని చూపించబోతోందట. తన ఎద అందాలని ఆరబోస్తూ కవ్విస్తోంది. అంతేనా తన కుడిచేతిపై యెద భాగంపై ..వీపు భాగంపై టాటూలు వేయించుకుని మరీ వాటిని చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

పై ఎద భాగంపై తన పేరుని.. కుడిచేతిపై రోజా పువ్వుని టాటూగా వేయించుకున్న ప్రియ వేపు భాగంలో మాత్రం అర్థ్ర చంద్రాకారణంలో మూన్ ని టాటూగా వేయించుకుని ఆ ఫొటోలతో కుర్రకారుని ఫ్లంట్ చేస్తోంది. అన్నట్టు టాలీవుడ్ లో నితిన్ .. బన్ని లాంటి వాళ్లు ఆఫర్లు ఇచ్చి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నారు. నితిన్ సరసన ఖాయమైందన్న వార్త వచ్చింది. తదుపరి అప్ డేట్ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అలాగే వివాదస్పద శ్రీదేవి బంగ్లా (హిందీ) రిలీజవుతుందా లేదా? అన్నది చూడాలి.