స్కూల్ ఫ్రెండ్స్ తో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తు పట్టండి

0

ఫొటోలో స్కూల్ డ్రస్ లో క్యూట్ గా కనిపిస్తున్న ముందు వరుస మద్యలో అమ్మాయిని గుర్తు పట్టారా.. ఈమె ఒక స్టార్ హీరో కూతురు ప్రస్తుతం టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా పేరు దక్కించుకుంది. మల్టీ ట్యాలెంటెడ్ అయిన ఈ అమ్మడు తెలుగులో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమాతో మొదటి సక్సెస్ ను దక్కించుకుని అప్పటి నుండి కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది. ఔను ఎక్కువ మంది గెస్ చేసినట్లుగా ఈమె శృతి హాసన్. స్కూల్ ఏజ్ లో స్నేహితులతో కలిసి తీసుకున్న ఈ ఫొటోను ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. నా లైఫ్ ను అందంగా మార్చిన ప్రతి ఒక్క స్నేహితులకు కృతజ్ఞతలు అంది.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యలో మాట్లాడుతూ.. తాను తెలుగుతో పాటు అన్ని భాషల్లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ భాష ఆ భాష అని కాకుండా ఈ పాత్ర ఆ పాత్ర అనే తేడా లేకుండా నచ్చిన అన్ని పాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. శృతి తండ్రి రాజకీయాల్లో ఉన్నాడు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో మీ నాన్న గారి పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారా అంటూ ప్రశ్నించగా అందుకు ఆసక్తి లేదని పేర్కొంది. ప్రచారం చేసే విషయంలో ఆసక్తి లేదని పేర్కొంది. నాన్న కూడా నన్ను ప్రచారం చేయమని అడగడంటూ శృతి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.