శివగామి పారితోషికం భయపెట్టేలా ఉందట

0

1990ల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ తెలుగు మరియు తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈమె బాహుబలి సినిమాలో శివగామి పాత్ర చేసిన తర్వాత ఆల్ ఇండియా స్టార్ డంను దక్కించుకుంది. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా రమ్యకృష్ణ ఇంకా ఆ సినిమా పాత్ర శివగామి తెచ్చిన పేరుతో కెరీర్ ను నెట్టుకు వస్తుంది అనడంలో సందేహం లేదు. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సహాయనటిగా ప్రచారం జరుగుతోంది.

ఒక్క రోజుకు 8 నుండి 10 లక్షల వరకు పారితోషికంగా ఈమె తీసుకుంటుందట. సినిమా కోసం బల్క్ గా డేట్లు కావాలంటే ఈమె పారితోషికం కోట్లలోనే పారితోషికం డిమాండ్ చేస్తుందట. కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ను మించి ఈమెకు మేకర్స్ పారితోషికం ముట్ట జెప్పుతున్నారట. పాత్ర కోసం ఈమె పారితోషికంను భరించి మరీ ఈమెను నటింపజేస్తున్నారట. పారితోషికం విషయంలో నిర్మాతలను ఆందోళన పెడుతున్న రమ్యకృష్ణ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పూరి తెరకెక్కిస్తున్న ఒక సినిమాలో నటిస్తుండగా.. మరో వైపు సాయి ధరమ్ తేజ్ దేవాకట్టాల కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా తమిళం మరియు తెలుగులో మరికొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది.