Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రదీప్ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్

ప్రదీప్ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్


యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గత ఏడాది విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ప్రదీప్ మొదటి సినిమా పైగా అంచనాలు భారీగా ఉన్నాయి కనుక ఓటీటీలో భారీగా డిమాండ్ చేసినా కూడా ఇన్ని రోజులు థియేటర్ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. ఎట్టకేలకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను విడుదల చేసేందుకు డేట్ ను ఖరారు చేశారు. సమ్మర్ లో పెద్ద సినిమాలు చాలా ఉన్న కారనంగా అంతకు ముందే అన్నట్లుగా ఈనెల చివర్లో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను జనవరి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. 200 మిలియన్ లకు పైగా ఈ సినిమా పాట నీలి నీలి ఆకాశంకు యూట్యూబ్ వ్యూస్ వచ్చాయి. గత ఏడాది ఎక్కడ విన్నా.. చూసినా ఇదే పాట వినిపించింది. ఈ పాట రేంజ్ లోనే సినిమా కూడా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. రిపబ్లిక్ డే వీక్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తో ప్రదీప్ మాచిరాజు హీరోగా సూపర్ హిట్ ను దక్కించుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.