పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం !

0

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఎన్నికల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుకాకూడదని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయ పడింది.

ప్రజారోగ్యం కరోనా వ్యాక్సినేషన్ ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఇదిలా ఉంటే నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు.ఇక ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 9న రెండో దశ ఫిబ్రవరి 13 మూడో దశ ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. అయితే హైకోర్టు ఎన్నికల షెడ్డ్యూల్ ను నిలిపివేయడం తో నిమ్మగడ్డ దీనిపై ఎలా ముందుకుపోతారో ఇప్పుడు ఆసక్తిగా మారింది.