Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా

ఫీల్డ్ లోనూ ‘బుట్టబొమ్మ’ను వదలని వార్నర్.. ఫ్యాన్స్ ఫిదా


ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ కు అల వైకుంఠపురము సినిమాలోని ‘బుట్ట బొమ్మ ‘ సాంగ్ అంటే అందరికీ తెలిసిందే. ఇండియా ఆస్ట్రేలియా భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా వార్నర్ మైదానంలోనే బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ వేసి ప్రేక్షకులను అలరించాడు. సుధీర్ఘ విరామం అనంతరం అభిమానులు స్టేడియానికి వెళ్లి మ్యాచ్లు వీక్షించే అవకాశం దక్కింది. కరోనా లాక్డౌన్తో చాలా రోజులుగా క్రికెట్ మ్యాచ్లు జరగడం లేదు. ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ 2020 జరిగింది. కానీ అక్కడ అభిమానులను అనుమతించలేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ టీవీల్లోనే మ్యాచ్ లు చూశారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్లు చూసేందుకు అభిమానులను అనుమతించారు.

స్టేడియం లో 50 శాతం మాత్రమే టికెట్లు విక్రయించి.. సోషల్ డిస్టెన్స్తో మ్యాచ్ను వీక్షించేందుకు అనుమతించారు. అయితే భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకున్నది. ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన వార్నర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సోషల్మీడియా లో ఎందరో ఆయనకు ఫ్యాన్స్ గా మారారు. మరో వైపు వార్నర్ కూడా తెలుగు పాటలకు డ్యాన్స్ లు చేస్తూ వీడియోలు రూపొందించారు. ఈ వీడియోలు ప్రేక్షకులను అలరించాయి.

‘బుట్టబొమ్మ’ ‘మైండ్బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు వార్నర్ ఫ్యామిలీ డ్యాన్స్ లు చేసింది. ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా లో మ్యాచ్ జరుగుతుండగా.. ‘వన్స్మోర్ వార్నర్.. బుట్టబొమ్మ’ అంటూ అభిమానులు పెద్దగా అరుస్తూ కేరింతలు కొట్టారు. వార్నర్ కూడా వారిని ఉత్సహ పరచడానికి ఫీల్డ్ లోనే చిందేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.