నాగ్ అశ్విన్ వల్ల దీపికకు అరుదైన ఛాన్స్ మిస్!

0

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికకు భారీ పాన్ ఇండియా మూవీలో నటించే ఛాన్స్ ని మిస్సయ్యిందా? అందుకు తెలుగు దర్శకుడు నాగ్ అశ్విన్ కారణమా? అంటే అవుననే సమాచారం.

ఇప్పటికే దీపిక యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తో పాటు ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న `ఆది పురుష్` కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది.

ఈ మూవీలోని సీత పాత్రకు తొలుత దీపిక పదుకొనేని ఎంపిక చేశారు. అయితే అప్పటికే దీపిక.. నాగ్ అశ్విన్ సినిమా అంగీకరించడంతో `ఆది పురుష్` కోసం ఆమెని కాకుండా మరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్ ల పేర్లు తెరపైకి వచ్చాయి తాజాగా మరెవరిని ఈ అవకాశం వరిస్తుందో చూడాలి. ప్రభాస్ నటించనున్న రెండు వరుస సినిమాల్లో దీపికనే అవకాశం వరించడం ఆసక్తికరం. కానీ ఒకదాని వల్ల వేరొకదానిని వదులుకోవడమే బ్యాడ్ అని అభిమానులు నిరాశపడుతున్నారు.