నాగచైతన్య విడుదల చేయనున్న ‘కేస్ 99’లోని ‘టిక్ టిక్ టిక్’ సాంగ్..!

0

ప్రముఖ కాలమిస్ట్ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శిని రామ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ”కేస్ 99”. ‘టాస్’ ‘మనోడు’ లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్.. మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న నేరాలు.. హత్యలు బలవన్మరణాలు కిడ్నాప్ లు అత్యాచారాల వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ ని కథాంశంగా చేసుకొని ప్రియదర్శిని రామ్ ఈ ఇన్వెస్టిగేషన్ డ్రామాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ ఫైల్ ‘వై’ (ఎందుకు) టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘కేస్ 99’ సినిమా నుంచి ‘టిక్ టిక్ టిక్’ లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేసింది.

రేపు(నవంబర్ 8) ఉదయం 10 గంటలకు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య చేతుల మీదుగా ‘టిక్ టిక్ టిక్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల కానుంది. ఇది ప్రేమలో విఫలమైన వారికి పర్ఫెక్ట్ సాంగ్ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆషిక్ అరుణ్ బాణీలు సమకూర్చిన ఈ సాంగ్ కి ప్రియదర్శిని రామ్ సాహిత్యాన్ని అందించడం విశేషం. ‘టిక్ టిక్ టిక్’ పాటని ఇషాక్ వలి ఆలపించారు. టి. సురేంద్ర రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరించారు. మెలోడ్రామా స్టూడియోస్ బ్యానర్ పై యువ నిర్మాతలు చిలుకూరి కీర్తి – గౌతమ్ రెడ్డి – వివేక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియదర్శిని రామ్ తో పాటు తిరువీర్ – అనువర్ణ – నిహాల్ కోదాటి – అజయ్ ఖతుర్వార్ – అపరాజిత – ప్రణీత పట్నాయక్ – క్రియేష్ రాజ్ – అశోక్ రావు – విజయ్ గోపరాజు – మనోజ్ ముత్యం – నితిన్ – ప్రసన్ – రోషన్ తదితరులు నటిస్తున్నారు.