ఘట్టమనేనీస్ హాట్ స్పాట్ లో ఒక సాయంత్రం

0

మహమ్మారీ కరోనా ఒక కోణంలో ఎంతో నష్టాన్ని కలగజేస్తుంటే వేరొక కోణంలో మానవాళికి చాలా మేలు చేస్తోంది. ఈ క్రైసిస్ కాలంలోనే బంధాలు అనుబంధాలు గుర్తుకొచ్చాయి చాలా మందికి. కుటుంబ సమేతంగా పార్టీలు ఫంక్షన్లు (ఊప్స్.. కరోనా భద్రతా నియమాల నడుమ) అంటూ అన్నిచోట్లా ఒకటే హడావుడి కనిపిస్తోంది.

బిజీ లైఫ్ ఇలాంటివాటికి అనుమతినివ్వదు. అందువల్ల దొరికిన సమయాన్ని మంచి రిలేషన్ షిప్స్ ని బలపరుచుకునేందుకు సద్వినియగం చేసుకుంటున్నారు.

అయితే చాలా మందితో పోలిస్తే మహేష్ పూర్తిగా వేరు. ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కావాల్సినంత సమయం కేటాయించే హీరోగా అతడంటే ప్రత్యేక గౌరవం ఉంది. మహేష్ బాబు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి సమయం కేటాయిస్తుంటారు. అందరితో సరదాగా పార్టీలు చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. తాజా సరదా సమావేశంలో మహేష్ తన సన్నిహితులు జేవియర్ – సబీనా అగస్టిన్ లతో కలిసి గత రాత్రి తన నివాసంలో టైమ్ స్పెండ్ చేశారు.

మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ లో ఫ్యామిలీ పార్టీ ఫోటోల్ని పంచుకున్నారు. “ఘట్టమనేనిస్ హాట్ స్పాట్ లో ఒక సాయంత్రం” అంటూ నమ్రత సరదాగా శీర్షిక పెట్టారు. లాక్ డౌన్ సమయంలో మహేష్ తన కుటుంబం స్నేహితులతో కొన్ని ఎగ్జయిటింగ్ పార్టీలతో ఆనందకరమైన సమయాన్ని ఆస్వాధిస్తున్నారు. సర్కార్ వారి పాట షూట్ ప్రారంభించడానికి అతను డిసెంబరులో యుఎస్ కు వెళ్లనున్నాడు. అమెరికాకు చిత్రబృందం కంటే ఆరురోజుల ముందే మహేష్ చేరుకోనున్నారని ఇంతకుముందు కథనాలొచ్చాయి.