చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ దీపిక ఎస్కేప్?

0

సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల కుంభకోణం అట్టుడికిస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలిపోతోంది. ఇందులో పలువురు కథానాయికలకు ఎన్.సి.బి సమన్లు పంపింది. శుక్ర.. శనివారాల్లో టాప్ హీరోయిన్లను మేనేజర్లను విచారణకు పిలిచింది.

సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కుంభకోణంలో సారా అలీ ఖాన్- దీపికా పదుకొనే- శ్రద్ధా కపూర్ సహా పలువురిని నేడు (25 సెప్టెంబర్) ఎన్.సిబి విచారించనుంది. ఇక దీపిక.. సారా అలీఖాన్.. శ్రద్ధ వంటి నాయికలకు సమన్లు అందడంతో షూటింగుల నుంచి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.

అయితే వీళ్లందరినీ విమానాశ్రయంలో మీడియా అటకాయిస్తున్న సంగతి విధితమే. అయితే దీపిక మాత్రం మీడియా నుంచి తప్పించుకున్నా ముంబై విమానాశ్రయంలో సారా అలీఖాన్ మాత్రం దొరికిపోయింది. గోవాలో ఉన్న దీపిక సహా సారా అలీ ఖాన్ ముంబైలో అడుగుపెట్టారు. కానీ ముంబై చేరుకోవడానికి చార్టర్డ్ ఫ్లైట్ ను అద్దెకు తీసుకోవడంతో దీపిక మీడియా హడావుడి నుంచి తప్పించుకుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

కానీ సారా అలీ ఖాన్ ముంబైలో మీడియా దబిడదిబిడను ఎదుర్కోవాల్సి వచ్చింది. సారా తన తల్లి అమృత సింగ్ తో కలిసి బయటకు వస్తుంటే .. వారిని విమానాశ్రయం వద్ద మీడియా వెంటాడింది. వెంబడించి మరీ బయటకు రప్పించింది. ఒకరకంగా ఫోర్స్ ఉపయోగించింది మీడియా. చివరికి సారా ఆమె తల్లి వారి కారులో ఎక్కడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందట. దీపిక.. సారాలు విచారణలో ఎన్.సి.బి కి ఏం చెబుతారోనన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.