ప్రియుడిని ఇన్సిపిరేషన్గా తీసుకుని కష్టపడుతోంది

0

బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఇటీవల 220 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన విషయం తెల్సిందే. అది మాత్రమే కాకుండా తన రెగ్యులర్ వర్కౌట్ వీడియోలను టైగర్ షేర్ చేస్తూ ఉంటాడు. ఆయన వర్కౌట్ వీడియోలకు విపరీతమైన ఆధరణ లభిస్తూ ఉంటుంది. ఆయన ప్రతి వీడియోకు దిశా పటాని స్పందిస్తూ ఉంటుంది. ఆయన్ను అభినందిస్తూ కామెంట్ పెడుతుంది. గత కొంత కాలంగా టైగర్ మరియు దిశాల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే. టైగర్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుందో ఏమో కాని దిశా పటాని కూడా కష్టమైన వర్కౌట్స్ చేస్తూ వావ్ అనిపించుకుంటుంది.

ఈమె ఇన్ స్టాగ్రామ్ లో ఇటీవల కష్టతరమైన వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. 40 మిలియన్ ల ఫాలోవర్స్ తన ఇన్ స్టా అకౌంట్ కు నమోదు అయిన సందర్బంగా 60 కేజీల వెయిట్ ను భుజంపై పెట్టుకుని 10 సార్లు సిట్ అప్స్ చేసింది. సాదారణంగా ఇలాంటి వర్కౌట్స్ అబ్బాయిలకే కష్టం. అన్ని సార్లు అంత బరువు వేసుకుని చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ అమ్మడు ఖచ్చితంగా తన ప్రియుడు టైగర్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. టైగర్ కు తగ్గ జోడీ అన్నట్లుగా ఈమెను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

40 million got me like🌸 60kg 10 reps 🌸 thank you my lovely fc’s for all the support and love, i’m nothing without you all❤️🧏🏼‍♀️

null