పూనం హీరోయిన్ పాత్రలకు రెడీ అంటోందా?

0

2005లో వచ్చిన ‘మొదటి సినిమా’తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూనం భజ్వ. ఈ అమ్మడు మొదటి సినిమాతో నిరాశ పర్చినా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కాని లక్ కలిసి రాక టాలీవుడ్ లో ఈమె పాసింగ్ క్లౌడ్ హీరోయిన్ మాదిరిగా నిలిచింది. తెలుగులో అదృష్టం కలిసి రాకపోవడంతో మలయాళం మరియు తమిళ సినిమాల్లో ప్రయత్నించింది. అక్కడ ఒక మోస్తరుగా సక్సెస్ లు దక్కించుకుంది. అక్కడ గౌరవ ప్రథమైన సినిమాలు చేసింది. మళ్లీ తెలుగులో ఈమె నటించేందుకు ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.

ఈ అమ్మడి వయసు వికీపీడియా అనుసారంగా 35కు వచ్చింది. ఈ వయసులో మళ్లీ హీరోయిన్ గా బిజీ అవ్వడం అంటే కాస్త కష్టమే. అయినా కూడా తన అందాలను ఆరబోస్తూ ఫొటో షూట్ చేయించుకుని వాటిని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంది. తాజాగా ఈ ఫొటోను షేర్ చేసిన పూనమ్ తాను ఇంకా కూడా హీరోయిన్ పాత్రలకు సిద్దంగా ఉన్నాను అని తన ఫిజిక్ మరియు అందంతో యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తాను అన్నట్లుగా ఈ అమ్మడి ఫొటోలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది.