రాహుల్ గాంధీ తప్పక ప్రధాని అవుతారన్న దీపిక

0

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన ఆ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపిక డ్రగ్స్ కేసు విచారణ శనివారం ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భవిష్యత్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని.. తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ గాంధీ ముందుంటారని దీపిక చెప్పుకొచ్చింది.

అసలైన దేశభక్తి తనకు రాహుల్ లోనే కనిపిస్తుందని.. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆ వీడియోలో దీపిక వ్యక్తం చేసింది. మంచి నాయకుడికి రాహుల్ సరైన ఉదాహరణ అని.. ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో ఎన్.సీ.బీ అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. ఇటీవలే పలువురు హీరోయిన్లను విచారించారు. దీపిక కూడా విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.